Vincy Aloshious: ఆ హీరో డ్రగ్స్‌ తీసుకొని ఇబ్బంది పెట్టాడు.. నటి విన్సీ సోనీ వీడియో రిలీజ్

Vincy Aloshious: ఆ హీరో డ్రగ్స్‌ తీసుకొని ఇబ్బంది పెట్టాడు.. నటి విన్సీ సోనీ వీడియో రిలీజ్

సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పలువురు నటీమణులు పలు సందర్భాల్లో ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తనకు కూడా సెట్ లో అలాంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైందని తాజాగా మలయాళ నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious) వెల్లడించింది.

అంతేకాదు తాను ఎదుర్కొన్న వేధింపుల తర్వాత, ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ తీసుకున్న ఏ ఆర్టిస్ట్ తోనూ కలిసి పని చేయనని ప్రకటించింది.తనతో గత సినిమాలో కలిసి నటించిన తోటి ఆర్టిస్ట్ డ్రగ్స్ తీసుకొని తనతో ప్రవర్తించిన తీరుతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది.

నటుడి పేరు లేదా సినిమా పేరు చెప్పకుండానే.. 'ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ హీరో డ్రగ్స్‌ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఎంతో ఇబ్బందిపడ్డా. తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు. అందరి ముందే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. నా జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన సంఘటన' అని చెప్పుకొచ్చింది. 

►ALSO READ | Ananya Panday: ఫ్రెంచ్ ఫ్యాషన్ ఛానల్కు.. బ్రాండ్ అంబాసిడర్గా లైగర్ బ్యూటీ..

వ్యక్తి గత జీవితంలో డ్రగ్స్ వాడాలా? వద్దా? అనేది వేరే విషయం. కానీ సెట్ పైన మాత్రం ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారితో కలిసి పనిచేయడం కష్టం. నేను మాత్రం అలాంటి వారితో పనిచేయను' అని పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

నేను అలాంటి ప్రకటన ఎందుకు చేశానో కొన్ని విషయాలను స్పష్టం చేసుకోవాలని నాకు అనిపించింది. నా వైఖరిని స్పష్టం చేయాలనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో చేస్తున్నాను" అని విన్సీ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

2018లో టాలెంట్ హంట్ షో 'నాయిక నాయకన్' ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.  2019లో వచ్చిన విక్రుతి సినిమాతో వచ్చి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జన గణ మనతో పాటుగా, 2023లో వచ్చిన థ్రిల్లర్ డ్రామా 'రేఖ', సౌదీ వెల్లాక్కా, మారివిల్లిన్ గోపురంగల్ వంటి మూవీస్ చేసి నటిగా రాణిస్తోంది.