AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్‌ ఏర్పాటు

ఏపీలో ఎన్నికల వేళ పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురంలోని తాడిపత్రి ప్రాంతాల్లో పరిస్థితులు అదుపుతప్పాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు బహిరంగ దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలతో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 

13 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్‌ బృందానికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సహా పలువురు ఉన్నారు. 

సభ్యులు

ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి(శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు(ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర ఆచారి(తిరుపతి), ఇన్‌స్పెక్టర్లు భూషణం(గుంటూరు రేంజ్‌), కె.వెంకట్‌రావు(విశాఖ), రామకృష్ణ, జీఐ శ్రీనివాస్‌, మోయిన్‌(ఒంగోలు), ఎన్‌.ప్రభాకర్‌రావు(అనంతపురం), శివప్రసాద్‌.