
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్ (53 కేజీ), బజ్‌రంగ్ పూనియా (65 కేజీ).. రాబోయే వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో గెలిస్తేనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే చాన్స్ ఇవ్వాలని ఐవోఏ అడ్‌హక్ ప్యానెల్ ప్రతిపాదించనుంది. ఒకవేళ ఓడితే ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో నెగ్గిన రెజ్లర్లనే బరిలోకి దించాలని సూచించనుంది. ఈ విషయాన్ని ప్యానెల్ మెంబర్ గియాన్ సింగ్ వెల్లడించాడు.
ALSO READ :సాత్విక్-చిరాగ్ @ వరల్డ్ నం.2
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసిన వినేశ్, బజ్‌రంగ్‌కు అడ్‌హక్ కమిటీ గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ రెండు కేటగిరీ ట్రయల్స్‌లో నెగ్గిన కాళీ రామన్ (65 కేజీ), అంతిమ్ పంగల్ (53 కేజీ) ఆందోళనకు దిగారు.