భారతీయులకు షాక్ : రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్

భారతీయులకు షాక్ : రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్

పారిస్ ఒలంపిక్స్ లో ఫైనల్ మ్యాచ్ కు కొన్ని గంటల ముందే వినేష్ ఫోగట్ అర్హత కోల్పోవడం కొన్ని కోట్ల మంది భారతీయుల గుండెల్లో నిరాశ మిగిల్చింది. దీంతో వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె గురువారం రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది.  రెజ్లింగ్ 50 కిలోల విమెన్స్ విభాగంలో వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. 

రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ Xలో ఓ పోస్ట్ పెట్టింది. మా కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి, మీ కల మరియు నా ధైర్యం చెరిగిపోయింది. నాకు ఇప్పుడు బలం లేదు.. అని వినేష్ ఫోగట్ పోస్ట్ లో రాసింది. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024 అని వినేష్ ఫోగట్ ట్విట్ చేస్తింది. 

వినేష్ 50కేజీల కంటే100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో సెకండ్ ప్లేస్ సాధించినా మెడల్ దక్కలే.. అంతే కాదు ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆమె కోర్ట్ ఆఫ్ అబ్రిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో అప్పీల్ చేసి.. ఈ ఈవెంట్‌లో తనకు రజత పతకం ఇవ్వాలని కోరింది. 2016 రియో  ఒలింపిక్స్‌లో 48 కేజీలు, 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో, 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో వినేష్ ఫోగట్ పాల్గొంది.