2032 వరకు ఆడతా : వినేశ్ ఫొగాట్

2032 వరకు ఆడతా : వినేశ్ ఫొగాట్

న్యూఢిల్లీ :  పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనర్హత వేటు పడిన వెంటనే తాను రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని  ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినేశ్ ఫొగాట్ తెలిపింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదంటూనే  2032 వరకు ఆటలో కొనసాగుతానని చెప్పింది.  ఈ మేరకు సోషల్ మీడియాలో శుక్రవారం భావోద్వేగ పోస్ట్ చేసింది. తన చిన్ననాటి కలను, తండ్రిని కోల్పోయిన తర్వాత ఎదుర్కొన్న కష్టాలను, పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రేక్ తర్వాత ప్రజల మద్దతును వివరించింది. ‘నేను, నా జట్టు ఇన్నాళ్లు కష్టపడి చేస్తున్న పనిని, మా లక్ష్యాన్ని అసంపూర్తిగా వదిలేశామని అంతా భావిస్తున్నారు.

ఇకపై  పరిస్థితులు మునుపటిలా ఉండకపోచ్చు. కానీ, వేర్వేరు పరిస్థితుల్లో  నేను 2032 వరకు ఆటలో కొనసాగవచ్చు. ఎందుకంటే నాలో పోరాటం, రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ అలానే ఉంటాయి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో,  తదుపరి ప్రయాణంలో  నాకు ఏం లభిస్తుందో ఊహించలేను.  కానీ నమ్మిన  దాని కోసం, సరైన దాని కోసం నేను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాను’ అని వినేశ్ పేర్కొంది.