Paris Olympics 2024: రజతం కోసం సీఏఎస్‌కు అప్పీల్ చేసిన వినేశ్ ఫొగాట్‌

Paris Olympics 2024: రజతం కోసం సీఏఎస్‌కు అప్పీల్ చేసిన వినేశ్ ఫొగాట్‌

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో బుధవారం (ఆగస్ట్ 7) ఉదయం 100 గ్రాములు అధిక బరువుతో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. దీంతో వినేశ్ ఫొగాట్‌ న్యాయం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తలుపు తట్టింది. తనకు రజత పతకం ఇవ్వాలని వినేష్ కోరినట్లు సమాచారం. ఈ విషయంపై  తీర్పు గురువారం (ఆగస్టు 8)  రాబోతుంది. వీరు ఇచ్చే తీర్పు పైనే ఫొగాట్‌ రజత పతక ఆశలు ఆధార పది ఉన్నాయి. ఒకవేళ సీఏఎస్ వినేశ్‌కు అనుకూలంగా తీర్పునిస్తే.. ఐఓసీ వినేశ్‌కు ఉమ్మడి రజతం అందించాల్సి ఉంటుంది.

ఫొగాట్ క్వాలిఫై కాలేకపోవడంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే దేశానికీ తిరిగి రానుంది. టోర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రకారం 50 కేజీల విభాగంలో ఫైనల్ కు వచ్చిన ఫొగాట్ పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం, కాంస్య విజేతలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఫొగాట్ పై అనర్హత వేటు పడిన కారణంగా ఆమెకు రజత పతకానికి అర్హత ఉండదు. దీంతో ఖాళీ చేతులతోనే ఆమె టోర్నీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 

CAS అంటే ఏమిటి?

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) అనేది ఒక స్వతంత్ర సంస్థ. మధ్యవర్తిత్వం ద్వారా క్రీడలకు సంబంధించిన వివాదాల పరిష్కరించడానికి 1984లో ఈ సంస్థ ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో ఉంది. న్యూయార్క్, సిడ్నీలలో కోర్టులు ఉన్నాయి. ఒలింపిక్ హోస్ట్ నగరాల్లో తాత్కాలిక కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. సీఏఎస్ ఏ క్రీడా సంస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (ICAS) యొక్క అడ్మినిస్ట్రేటివ్,  ఫైనాన్షియల్ అథారిటీ కింద పనిచేస్తుంది. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది మధ్యవర్తిత్వ సేవలను అందిస్తుంది.