Vinesh Phogat: కన్నీళ్ళతోనే స్వదేశానికి... ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న వినేశ్‌‌ ఫొగాట్‌‌

Vinesh Phogat: కన్నీళ్ళతోనే స్వదేశానికి... ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ చేరుకున్న వినేశ్‌‌ ఫొగాట్‌‌

ఒలింపిక్స్‌‌లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ వినేశ్‌‌ ఫొగాట్‌‌ వేసిన పిటిషన్‌‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌‌ ఫర్‌‌ స్పోర్ట్స్‌‌ (కాస్‌‌) అడ్‌‌హక్‌‌ డివిజన్‌‌ కొట్టేసింది. కనీసం రజత పతకమైనా ఇవ్వాలన్న రెజ్లర్‌‌ అభ్యర్థనను కాస్‌‌ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దీంతో వినేశ్‌‌ పతకం లేకుండానే పారిస్‌‌ గేమ్స్‌‌ను ముగించినట్లయింది. ఈ హార్ట్ బ్రేక్ తర్వాత తాజాగా ఆమె శనివారం (ఆగస్ట్ 17) స్వదేశానికి వచ్చేసింది.

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పారిస్‌లోని భారత బృందానికి  చీఫ్ డి మిషన్‌గా ఉన్న షూటర్ గగన్ నారంగ్..పారిస్ విమానాశ్రయంలో ఫోగట్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆమెను ఛాంపియన్ అని పిలిచాడు. ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లారు. వినేష్ ఫోగట్ శనివారం భారత్ వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున తరలివస్తారనే ఉద్దేశ్యంతో పోలీసు సిబ్బందిని మోహరించారు.

Also Read:- జింబాబ్వేలో మహిళల టీ20 ప్రపంచ కప్..?

ఫోగాట్‌ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె అంతకంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హురాలిగా ప్రకటించిన తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. అయితే మనసు మార్చుకున్న వినేష్ ఫొగట్.. శుక్రవారం ఆగస్టు 16, 2024న రెజ్లింగ్ వృత్తిని 2032 వరకు కొనసాగిస్తానని X ద్వారా తెలిపింది. సోషల్ మీడియాXలో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో.. వినేష్ తన ఇటీవలి రిటైర్మెంట్ ప్రకటన దురదృష్టకర పరిస్థితులలో వచ్చిందని రాశారు.