Vinesh Phogat: రైతుల నిరసనలో పాల్గొన్న వినేష్ ఫోగట్.. న్యాయం చేయలంటూ డిమాండ్ 

Vinesh Phogat: రైతుల నిరసనలో పాల్గొన్న వినేష్ ఫోగట్.. న్యాయం చేయలంటూ డిమాండ్ 

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ శంభు సరిహద్దులో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనకారులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శంభు సరిహద్దు వద్ద రైతు సంఘాల భారీ నిరసనలో ఫోగట్ చేరారు. వందలాది మంది రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 13న శంభు సరిహద్దులో క్యాంపింగ్ ప్రారంభించారు.

కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ ఉన్న ఈ నిరసన శనివారం (ఆగస్ట్ 31)  నాటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా  వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. " రైతులు ఇక్కడ కూర్చొని 200 రోజులైంది. వారిని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. వీరంతా ఈ దేశ పౌరులే. రైతులే దేశాన్ని నడుపుతున్నారు. వారు లేకుండా ఏదీ సాధ్యం కాదు. కేంద్రం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.  ఇలా వీధుల్లో కూర్చుంటే దేశం అభివృద్ధి చెందదు". అని ఆమె అన్నారు.

Also Read :- దూసుకొస్తున్న ద్రవిడ్ తనయుడు