Vinesh Phogat : నాకు అక్కడ ఎలాంటి మద్దతు లభించలేదు: వినేష్ ఫోగట్

Vinesh Phogat : నాకు అక్కడ ఎలాంటి మద్దతు లభించలేదు: వినేష్ ఫోగట్

పారీస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒలింపిక్స్  అనర్హత తర్వాత ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నుంచి తనకు ఎలాంటి  సపోర్టు లేదని.. జరిగిన పరిణామాలన్నింటి వెనక రాజకీయాలు నడిచాయని వినేస్ ఫోగట్ అన్నారు. 

50 కిలోల వెయిట్ కేటగిరిలో కేవలం 100 గ్రాముల బరువు కారణంగా స్వర్ణం చేజారిందని.. పోటీలో పాల్గొనడానికి అనర్హురాలిగా ప్రకటించిన తర్వాత ఎలాంటి మద్దతు లభించలదేని స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. బరువును తగ్గించుకునే ప్రయత్నాలు ఫలించలేదని.. అదీకాస్త డీహైడ్రేషన్ కు దారి తీసి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు.

ఆ సమయంలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉష సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు వినేష్ ను ఆస్పత్రిలో కలిసి ఆమెతో ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే  ప్యారిస్ లో తనకు ఎలాంటి మద్దతు లభించలేదని పీటీ ఉష తనతో ఓ ఫొటోను క్లిక్  చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజకీయంలో భాగమని అన్నారు.అందుకే తాను రెజ్లింగ్ వీడాలని నిర్ణయించుకన్నారు వినేష్ ఫొగట్ అన్నారు. 

Also Read:-సెప్టెంబర్ 14, 15న ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్​ మూడో రౌండ్ పోటీలు