ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం ముందు అనర్హత వేటు పడిన రెజ్లర్ నివేశ్ ఫొగాట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మరికొన్ని గంటల్లో రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో తలపడాల్సి ఉన్న సమయంలో.. భారత రెజ్లర్ ఫొగాట్ పై.. కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటం వల్ల.. ఒలింపిక్స్ పోటీలకే అనర్హతగా ప్రకటించటంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధానిమోదీ.. ఫొగాట్ పై అనర్హత వేటుపై స్పందించారు.
మోదీ స్పందన ఇలా :
వినేశ్ ఫొగాట్.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్.. మీరు భారతదేశానికే గర్వకారణం. భారతీయులు అందరికీ స్ఫూర్తి. ఈ రోజు మీకు ఎదురుదెబ్బ తగలొచ్చు.. మీరు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలం.. ఇదే సమయంలో మీలోని పోరాట స్ఫూర్తి.. సవాళ్లను ఎదురొడ్డి మీ స్వభావంతో.. మీరు బలంగా ఇండియాకు తిరిగి రండి. మేమంతా మీ కోసం మేం ఎదురుచూస్తూ ఉంటాం అని ఓదార్చారు ప్రధాని మోదీ..
Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian.
— Narendra Modi (@narendramodi) August 7, 2024
Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.
At the same time, I know that you epitomise resilience. It has always…