Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థులుగా వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా

న్యూఢిల్లీ: రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బుధవారం ( సెప్టెంబర్ 4) మధ్యా హ్నం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. హర్యానా ఎన్నికల సమయంలో వినేష్, పునియా కాంగ్రెస్లో చేరడం కీలక పరిణామం అన్నారు రాహుల్ గాంధీ. 

వచ్చే నెల(అక్టోబర్) లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న క్రమంలో కాంగ్రస్ బుధవారం కాంగ్రెస్ ఎన్నికల సంఘం సమావేశమయ్యింది. ఈ సమావేవంలో వినేష్ ఫోగట్ను కాంగ్రెస్ తరపున హర్యానాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో దేనికైనా పోటీ చేయడానికి కాంగ్రెస్ ఆఫర్ చేరసింది. చర్కీదాద్రి, బద్ధా, జులనా నియోజ కవర్గాల నుంచి దేనికైనా పోటీ చేసేందుకు వినేష్ ఫోగట్ కు ఆఫర్ ఇచ్చారు. 

చర్కీ దాద్రీ వినేష్ ఫోగట్ సొంత జిల్లా.., ఆమె సొంత గ్రామం బలాలీ.. బద్ధాడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇక ఆమె అత్తమామల ఇల్లు జులనాలో ఉంది.. దీంతో కాంగ్రెస్ ఈ మూడు నియోజకవర్గాలనుంచి వినేష్ ఫోగట్ కు పోటీ చేయాలని కోరారు. 

మరోవైపు బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది.  బహదూర్ ఘర్ లేదా భివానీ నుంచి రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ రెండు స్థానాలు జాట్ ల ప్రాబల్యం ప్రాంతాలు. అయితే బద్లీ , ఝజ్జర్ లోని సోనిపట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని బజరంగ్ పునియా చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు.  బద్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కులదీప్ వత్స్.. హర్యానా కాంగ్రెస్ ప్రముఖులలో ఒకరు.. దీంతో ఆయన టికెట్ రద్దు చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. సోనిపల్ లోని ప్రస్తుత కాంగ్రస్ ఎమ్మెల్యే సురేంద్ర పర్వాన్ ఓ కేసులో జైలులో ఉన్నారు. ఆ స్థానం నుంచి అతని కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఇప్పటివరకు బజరంగ్ పునియా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.