Paris Olympics 2024: రెజ్లర్ ఫొగాట్ పై అనర్హత వేటు.. కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు అంట..!

Paris Olympics 2024: రెజ్లర్ ఫొగాట్ పై అనర్హత వేటు.. కేవలం 100 గ్రాములు ఎక్కువ బరువు అంట..!

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ నుంచి వినేశ్ ఫొగాట్‌‌‌‌ స్వర్ణ పతకం సాధించాలన్న ఆశలు ఆవిరైపోయాయి. 29 ఏళ్ల ఆమె.. రెండో రోజు పోటీకి అనర్హురాలిగా తేలింది. ఫైనల్ రోజు ఆమె 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు తేలింది. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోటీకి 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు ఒలింపిక్స్ అధికారులు. మంగళవారం (ఆగస్ట్ 6) రాత్రి వినేశ్ ఫొగాట్ బృందం అత్యుత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

రూల్స్ ప్రకారం ఒక అథ్లెట్ హాజరు కాకపోయినా లేదా విఫలమైతే పోటీ నుంచి తొలగించబడి చివరి ర్యాంక్ లో ఉంటారు. ఉమెన్స్ రెజ్లింగ్ 50 కేజీల తరగతి నుండి వినేశ్ ఫొగాట్ అనర్హత వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం అని ఒక ప్రకటనలో తెలిపింది. వినేశ్ గోప్యతను గౌరవించాలని భారత జట్టు వేడుకుంటుంది. కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండవల్లే అనర్హత వేటు వేసినట్లు ప్రకటించటం సంచలనంగా మారింది.