Paris Olympics 2024: గోల్డ్ మిస్.. సిల్వర్‌కు నో ఛాన్స్: ఒట్టి చేతులతోనే ఫొగాట్‌ ఇంటికి

Paris Olympics 2024: గోల్డ్ మిస్.. సిల్వర్‌కు నో ఛాన్స్: ఒట్టి చేతులతోనే ఫొగాట్‌ ఇంటికి

ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌‌‌‌ పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో మ్యాజిక్‌‌‌‌ చేసింది. మేటి రెజ్లర్‌‌‌‌‌‌‌‌గా పేరున్నా.. ఫామ్ దృష్ట్యా ఈసారి పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వినేశ్‌‌‌‌..  టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌, నాలుగు సార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌ యుయి సుసాకితో పాటు  మరో ఇద్దరు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది.  విమెన్స్‌‌‌‌ 50 కేజీ పోటీల్లో మంగళవారం ఒక్కరోజే సెమీస్ సహా మూడు రౌండ్లలో అద్భుత ఆట చూపెట్టింది.

సెమీఫైనల్లో వినేశ్‌‌‌‌ 5–0తో క్యూబా రెజ్లర్‌‌‌‌‌‌‌‌ గుజ్మన్‌‌‌‌ లోపేజ్‌‌‌‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌‌‌‌ చేరుకుంది. దీంతో 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్‌‌‌‌ గోల్డ్ మెడల్ సాధిస్తుందని భారత అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. స్వర్ణ పతకం మిస్ అయినా కనీసం రజత పతకం సాధిస్తుందని ఆశించారు. ఒలింపిక్స్ లో పతకం ఖాయమైనందుకు దేశమంతా సంబరాలు జరిగాయి. అయితే బుధవారం( ఆగస్ట్ 7) ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోటీలో ఉదయం 100 గ్రాములు అధిక బరువుతో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. 

ఫొగాట్ పై క్వాలిఫై కాలేకపోవడంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే దేశానికీ తిరిగి రానుంది. టోర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రకారం 50 కేజీల విభాగంలో ఫైనల్ కు వచ్చిన ఫొగాట్ పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం, కాంస్య విజేతలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఫొగాట్ పై అనర్హత వేటు పడిన కారణంగా ఆమెకు రజత పతకానికి అర్హత ఉండదు. దీంతో ఖాళీ చేతులతోనే ఆమె టోర్నీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.