Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు అస్వస్థత

Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు అస్వస్థత

ఢిల్లీ: రెజ్లర్, ఒలింపిక్ క్రీడాకారణి వినేశ్ ఫొగాల్ అస్వస్థతకు గురైంది. పారిస్ నుంచి ఇండియాకు వచ్చిన ఆమెకు ఢిల్లీ, హర్యానలో ఘనస్వాగతం లభించింది. హర్యానాలోని బలాలికి చేరుకున్న ఆమెకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి భారీ లడ్డూను బహూకరించారు. సుదీర్ఘమైన ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేశ్‌.. సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే ఉండిపోయింది. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వినేశ్‌ ఫొగాట్ పక్కనే ఆమె పెదనాన్న మహవీర్‌ ఫొగాట్‌, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తదితరులు ఉన్నారు. కొద్దిసేపటికి మంచినీటిని తాగిన తర్వాత వినేశ్‌ కాస్త తేరుకున్నట్లు కనిపించింది. ‘‘ఎక్కువ సమయం ప్రయాణించడం, షెడ్యూలింగ్‌ కారణంగా ఆమె కాస్త ఇబ్బంది పడింది. స్వగ్రామంలో వినేశ్‌కు అద్భుతమైన స్వాగతం లభించింది’’ అని పునియా వెల్లడించాడు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆమె మధ్యలో అభిమానులను కలుస్తూ 13 గంటల తర్వాత  బలాలీకి చేరుకుంది. 

అర్ధరాత్రి ఇంటికి చేరిన ఆమెకు గ్రామస్తులు, ఇరుగు పొరుగు, స్నేహితులు పూల దండలతో స్వాగతం పలికారు. అంతకుముందు డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వ్యతిరేకంగా జరిగిన నిరసన గురించి వినేశ్‌‌ మాట్లాడింది. ‘ఈ పోరాటంలో మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. జీవితమే ఒక పోరాటం. మా  పోరాటం ముగిసిపోలేదు. న్యాయం కోసం మేం ఏడాదిగా పోరాడుతున్నాం. దాన్ని కొనసాగిస్తాం. దేవుడి దయతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.