Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ

Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ

భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి థానేలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారు. మీడియా కథనాల ప్రకారం.. కాంబ్లీ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్తున్నప్పటికీ.. విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రి వైద్యులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ తగు చికిత్స అందిస్తున్నారు.

వినోద్ కాంబ్లీ 1991లో భారత జట్టు తరఫున వన్డేల్లో.. 1993లో టెస్టుల్లో అరంగేట్రం చేశారు. ఆరంభంలో కాంబ్లీ భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. అత్యంత వేగంగా 1000 టెస్టు పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచారు. అతను 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత పేలవ ప్రదర్శన కారణంగా కనిపించకుండా పోయారు.

ALSO READ | IND vs AUS: బుమ్రాకు భయపడేవాడిని కాదు.. ధీటుగా ఎదుర్కొంటా..: సామ్ కొంటాస్

భారత జట్టు తరపున 17 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీ..  4 సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 1084 పరుగులు చేశారు. 104 వన్డేల్లో మొత్తం 2477 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.