బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : బి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే అన్ని వర్గాలకు న్యాయం 

  • ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​బి.వినోద్ కుమార్

వేములవాడ, కోనరావుపేట, వెలుగు :  బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ప్లానింగ్ ​కమిషన్​ వైస్​ చైర్మన్​ బి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​అన్నారు. శుక్రవారం వేములవాడలో బీఆర్ఎస్​అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో జరిగిన కార్యక్రమానికి వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు.

అనంతరం వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం యువత శ్రమించాలని కోరారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ- తదితరులు పాల్గొన్నారు.  అనంతరం కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ పరిశీలించారు.