పొన్నం హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి
కరీంనగర్ టౌన్, వెలుగు: బోయినిపల్లి వినోద్ కుమార్ ముమ్మాటికి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నాన్‌లోకల్ లీడరేని, ఆయనతోపాటు కేటీఆర్, రసమయి బాలకిషన్ సైతం నాన్ లోకల్ లీడర్లేనని డీసీసీ ప్రెసిడెంట్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం డీసీసీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శించే స్థాయి జీవీ రామకృష్ణారావుకు లేదన్నారు. కరీంనగర్– తిరుపతి రైలు, పాస్ పోర్టు ఆఫీస్.. తదితర ఎన్నో అభివృద్ధి పనులు పొన్నం ప్రభాకర్హయాంలోనే జరగాయని గుర్తుచేశారు. వినోద్ కుమార్, బండి సంజయ్ లు ఎంపీలుగా కరీంనగర్ కు ఏమీ చేయలేదని ఆరోపించారు. 563నేషనల్ హైవేకు 2014లోనే కేంద్రం అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు. సొంత లాభం కోసం హైవే అలైన్ మెంట్మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. సమావేశంలో పద్మాకర్ రెడ్డి, మోహన్, రహమత్ హుస్సేన్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
అధికారులే లబ్ధిదారులను ఎంపిక చేయాలి
జ్యోతినగర్, వెలుగు: ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా దళితబంధు స్కీం లబ్ధిదారులను అధికారులే ఎంపిక చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ కార్పొరేటర్ కౌషిక లత ఆధ్వర్యంలో లీడర్లు రామగుండం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి పార్లమెంటరీ కన్వీనర్ మల్లికార్జున్, లీడర్ కౌషిక హరి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కేంద్రంగా టీఆర్ఎస్ కార్పొరేటర్లకు, పర్సంటేజీ ఇచ్చిన వారికే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో ఇచ్చినట్లే రామగుండంలో కూడా అందరికీ దళితబంధు ఇవ్వాలన్నారు. అనంతరం రామగుండం తహసీల్ఆఫీసు ఎదుట వీఆర్ఏల నిరవధిక సమ్మెకు కౌషిక్ లత మద్దతు తెలిపి రూ.5వేల ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో మారం వెంకటేశ్, మహనది రామన్న, రాజు, శశికుమార్, రవి, గంగాప్రసాద్, నరహరి,
రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బాపూజీ జయంతిని కేటీఆర్ రాజకీయం చేశారు
సిరిసిల్ల టౌన్, వెలుగు: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంత్రి కేటీఆర్ రాజకీయం చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఆరోపించారు. బుధవారం గోపి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లలో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పద్మశాలి కులబాంధవులు పార్టీలకతీతంగా పోరాటం చేశారని, విగ్రహ ఏర్పాటుకు అన్ని పార్టీల పద్మశాలీ కులస్తులను ఆహ్వానించకుండా.. కేటీఆర్ రాజకీయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లయినా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఎక్కడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చేనేత రంగానికి కేంద్రం ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెట్టింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెట్టింది.. అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, లీడర్లు కైలాశ్, రాజాసింగ్, లక్ష్మారెడ్డి, అంజన్న, శ్రీధర్ పాల్గొన్నారు.
రక్తదానం మహోన్నత కార్యం
హుజూరాబాద్ వెలుగు: ప్రమాదాలు, ఎమర్జెన్సీ టైంలో మనిషి ప్రాణాలను కాపాడేది రక్తమేనని, రక్తదానం మహోన్నత కార్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హుజూరాబాద్‌లో ఏర్పాటుచేసిన బ్లడ్‌డొనేషన్, బ్లడ్ గ్రూప్ టెస్ట్క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లీడర్లు రాజు, రాముల కుమార్, కరుణాకర్, మహేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
తొమ్మిది స్టూడెంట్స్‌కు ఉద్యోగాలు
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: తమ కాలేజీకి చెందిన తొమ్మిది మంది స్టూడెంట్స్ వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ దిడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని వికాస్ కాలేజ్ లో ఐసీఐసీఐ, టైమ్స్ ప్రో ఆధ్వర్యంలో ఇంటర్వూలు నిర్వహించగా 9 మంది ఎంపికైనట్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ, టైమ్స్ ప్రో ప్రాజెక్ట్ రిలేషన్ మేనేజర్ వినయ్, జగన్ గౌడ్, వేణుగోపాల్, కాలేజ్ లెక్చరర్స్,స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం.. సీఎం అభిమతం
ఇల్లందకుంట, వెలుగు: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతమని, అనునిత్యం పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని తపించే గొప్ప నాయకుడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఇల్లందకుంటలో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఇల్లందకుంట మండలంలో 4452 పాత పెన్షన్లతో పాటు కొత్తగా 746 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్కనుమల్ల విజయ, ఎంపీపీ పావని, కేడీసీసీ వైస్‌చైర్మన్ పింగిలి రమేశ్, తహసీల్దార్ మాధవి, ఇన్చార్జి ఎంపీడీవో వెంకటేశ్వర్లు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఘనంగా బతుకమ్మ సంబురాలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రీ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బతుకమ్మ ఆడి ఆడారు. విద్యాసంస్థల చైర్మన్అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ, ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్పాల్గొన్నారు.
శ్రీవాణిలో...
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కాలేజీలో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ సుష్మ, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత పాల్గొన్నారు.
సింగరేణి హాస్పిటల్‌లో కార్మికుడు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనేనని కుటుంబ సభ్యులు, యూనియన్ నేతల ఆందోళన
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న తిప్పారపు శ్రీనివాస్ (46) అనారోగ్యంతో చికిత్సపొందుతూ గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో మంగళవారం అర్ధరాత్రి చనిపోయారు. హాస్పిటల్‌కు చెందిన చెస్ట్ ఫిజిషియన్ నిర్లక్ష్యం వల్లనే శ్రీనివాస్ చనిపోయారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన లీడర్లు బుధవారం హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్మికుడి మృతికి కారకుడైన డాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్జీ 1 ఏరియా ఎస్‌వోటు జీఎం రాంమోహన్, పర్సనల్ డీజీఎం లక్ష్మీనారాయణ, హాస్పిటల్ ఏసీఎంవో కిరణ్‌రాజ్ కుమార్ జోక్యం చేసుకుని డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనకు కార్మిక నాయకులు టి.రాజారెడ్డి, సత్తయ్య, ధర్మపురి, కృష్ణ, ఐ.కృష్ణ, ఇ.నరేశ్, ఎంఎస్ రాజ్ ఠాకూర్, జడ్పీటీసీ సంధ్యారాణి మద్దతుగా నిలిచారు.
ఘనంగా ఫ్రెషర్స్ డే
తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలో నవతరంగ్ 2 కే 22 ఫ్రెషర్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్డా.జి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ స్టూడెంట్స్తమ అనుభవాలను జూనియర్స్ తో పంచుకోవాలన్నారు. ఫస్ట్‌ఇయర్‌లో చేరినవారు సీనియర్స్‌తో కలిసిమెలిసి ఉండి వారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు విశ్వనాథ్, వినోద్, ప్రకాశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సీహెచ్శ్రీనివాస్, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రమేశ్, హెచ్వోడీలు పాల్గొన్నారు.
యువజనోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ చీఫ్
కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లా స్థాయి యువజనోత్సవాల పోస్టర్ ను బుధవారం కరీంనగర్చైతన్యపురిలోని మహాశక్తి టెంపుల్ లో బీజేపీ స్టేట్చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జరుగుతాయన్నారు. యువత పెద్ద సంఖ్యలో హాజరై జాతీయస్థాయిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజనోత్సవ అధికారి ఎం.వెంకట్ రాంబాబు, కార్పొరేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరెంట్‌షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు మృతి
కోనరావుపేట,వెలుగు: భవన నిర్మాణ పనులు చేస్తుండగా హై టెన్షన్ కరెంట్‌వైర్లు తగిలి ఓ కార్మికుడు చనిపోయాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన బొడ్డు దేవవ్వ కొత్త ఇంటి నిర్మాణ పనులను మధ్యప్రదేశ్ కు చెందిన ఓబేష్ కుమార్ చౌదరి(30) అనే మేస్త్రీ పలంచా మీద నిలబడి పనులు చేస్తుండగా హై టెన్షన్ వైర్లు తగిలి కింద బేస్మెంట్ మీదపడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు కరీంనగర్ హాస్పిటల్‌కు కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోనరావుపేట, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. బుధవారం కోనరావుపేటలోని మాచిన్ చెరువులో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి చేప పిల్లలను వదిలారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వయో వృద్ధుల వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ చేపల మార్కెటింగ్ కు ప్రభుత్వం ఔట్ లెట్లు, టూ, ఫోర్వీలర్వాహనాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, సర్పంచ్ లు రేఖ, సంతోష్, ఎంపీటీసీ చారి పాల్గొన్నారు.
దీపావళి లోగా మార్కెట్ పనులు పూర్తి చేయాలి
వేములవాడ, వెలుగు: దీపావళి లోగా శ్యామకుంట వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.- బుధవారం వేములవాడలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్పరిశీలించారు. పట్టణంలోని స్కూళ్లలో చేపట్టిన పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం జీ ప్లస్1 నిర్మాణంలో ఉన్న శ్యామకుంట వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ను పరిశీలించారు. మార్కెట్ పనులు 80 శాతం మేర పూర్తి అయినందున మిగతా పనులను దీపావళి లోగా పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డ్ కు వేములవాడ టౌన్ఎంపిక అవ్వడంపై మున్సిపల్ చైర్ పర్సన్ మాధవిని అభినందించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జగిత్యాల, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సూచించారు. జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ లో ప్రభుత్వ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. హాస్పిటల్ లోని డయాలసిస్ రూంలో ఏసీలో పనిచేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిటీ స్కాన్ రూం, ఆఫ్తమాలజీ రూంలను పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌డా. రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, లీడర్లు పరశురామ్ గౌడ్, భోగ ప్రవీణ్, దాసరిప్రవీణ్, రామ్మోహన్ రావు, ఏఈ రాజమల్లయ్య ఉన్నారు.
శ్రీచైతన్యలో ట్రెడిషనల్ డే
తిమ్మాపూర్, వెలుగు: స్టూడెంట్స్అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్పెంపొందించుకోవాలని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్‌కాలేజీ(ఎంసీఏ)లో ట్రెడిషనల్డే –2022ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్‌తోపాటు, అనుభవమున్న ఫ్యాకల్టీ ఉన్నారని, కాలేజీలోని సదుపాయాలను వినియోగించుకొని స్టూడెంట్స్ ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డా. జి.వెంకటేశ్వర్లు, హెచ్‌వోడీ మురళి, అడ్మినిస్ట్రేటర్రామారావు, పాల్గొన్నారు.