అంజన్న భక్తులకు నీటి కష్టాలు ఉండవు: సుంకే రవిశంకర్​

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్నభక్తుల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ప్లానింగ్​కమిషన్​ వైస్​ చైర్మన్​ బి.వినోద్‌కుమార్‌‌, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ తెలిపారు. గురువారం పంప్​హౌజ్​నిర్మాణ పనులకు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.13.43కోట్లతో ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పంప్​హౌజ్​ద్వారా అంజన్న భక్తుల తాగునీటి కష్టాలు తొలగుతాయన్నారు.

 వరద కాలువ వద్ద ఏర్పాటు చేసే పంప్ హౌస్ ద్వారా వాటర్ 2కి.మీ దూరంలో ఉన్న సంతలోని లొద్ధికి చేరుకొని అక్కడి నుంచి మరో లిఫ్ట్ ద్వారా గుట్ట కింద ఉన్న సంపులోకి చేరుకుంటాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ భాష, జడ్పీ చైర్మన్ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ పాల్గొన్నారు.