భోగ్‌‌ భండార్‌‌ కార్యక్రమాన్ని సక్సెస్‌‌ చేయాలి : వినోద్‌‌కుమార్‌‌

జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న సేవాలాల్‌‌ జయంతి, మహా భోగ్​బండార్‌‌ కార్యక్రమాన్ని సక్సెస్‌‌ చేయాలని నిర్వహణ అధికారి వినోద్‌‌కుమార్‌‌ సూచించారు. జనగామ నియోజకవర్గంలోని జనగామ, నర్మెట, తరిగొప్పుల, దూల్మిట్ట మండలాలకు చెందిన గిరిజన నాయకులతో శనివారం కలెక్టరేట్‌‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఎన్‌‌ఎంఆర్‌‌ గార్డెన్స్‌‌లో నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి గిరిజన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో లక్ష్మణ్‌‌నాయక్‌‌, వాంకుడోత్‌‌ అనిత, ధర్మభిక్షం, బానోతు రవినాయక్, భూక్య చందునాయక్, ధరావత్​భిక్షపతి పాల్గొన్నారు.