
హైదరాబాద్, వెలుగు: సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు వినోద్ కుమార్ సత్తా చాటాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన వినోద్ సిల్వర్ మెడల్ నెగ్గాడు. బుధవారం జరిగిన మెన్స్ 800 మీటర్ల రేస్‌లో వినోద్ 1 నిమిషం 50.07 సె. రెండో స్థానం సాధించాడు. శ్రీలంకకు చెందిన హవిందు (1:49.83సె) స్వర్ణం, ఇండియాకే చెందిన క్లప్పా బోపన్న (1:50.45సె) కాంస్యం గెలిచారు.