చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

రేగొండ, వెలుగు: చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం అందించే విషయంలో అంకిత భావంతో పనిచేయాలని పోలీసులకు సూచించారు.