మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాడులు, హత్యలు నమోదవుతున్నాయి. ఇంఫాల్ కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్ చప్పి గ్రామంలో కుకీ తిరుగుబాటదారులు ఆదివారం ఉదయం చేసిన దాడిలో ఐదుగురు మరణించారు. బిష్ణుపూర్‌లో శుక్రవారం రాకెట్ దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. జరుగుతున్న హింసను నిరసిస్తూ వేలాది మంది మానవహారంగా ఏర్పాటు చేశారు. జిరిబామ్‌లో మెయితెయ్, కుకీ వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరగగా.. వ్యక్తిని నిద్రలో కాల్చి చంపగా, మరో నలుగురు మరణించారు.
రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతిభద్రతలపై చర్చించేందుకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శనివారం సాయంత్రం బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఎమ్మెల్యేలతో సహా రాష్ట్ర అధికార కూటమి నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మిలిటెంట్లు ఇంట్లోకి దూరి మరీ సామాన్య ప్రజలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు.
బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన వేర్వేరు బాంబు దాడిలో పలువురు గాయపడ్డారు. మణిపూర్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను మోహరించారు. కొండ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడానికి పోలీస్ టీంలు సిద్ధమైయ్యారు. వైమానిక పెట్రోలింగ్ కోసం మిలటరీ హెలికాప్టర్‌ను కూడా తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలోని నారాయణ్‌సేన, నంబోల్ కమోంగ్ మరియు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని పుఖావో, దోలైతాబి, శాంతిపూర్‌లో డ్రోన్లు కనిపించాయని అధికారుల తెలిపారు.