పాక్ నిరసనల్లో హింస: ఆరుగురు పోలీసులు మృతి.. 119 మందికి తీవ్రగాయాలు

పాక్ నిరసనల్లో హింస: ఆరుగురు పోలీసులు మృతి.. 119 మందికి తీవ్రగాయాలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‎ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన సపోర్టర్లు చేపట్టిన నిరసన హింసాత్మకం అయింది. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వారు మంగళవారం దేశ రాజధానికి చేరుకున్నారు. వారు ఇస్లామాబాద్‎లోకి ప్రవేశించకుండా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.

మద్దతుదారులను బలగాలు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పరిస్థితి ఆందోళనకరంగా మారి హింసకు దారితీసింది. ఈ గొడవలో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. పదుల సంఖ్యలో సిబ్బంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పారామిలిటరీ రేంజర్లు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఇస్లామాబాద్‎లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీచేసింది.