పంజాబ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్పై దాడి..ఒకరు మృతి

పంజాబ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్పై దాడి..ఒకరు మృతి

పంజాబ్ యూనివర్శిటీ కచేరీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో విద్యార్థి మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలోని సౌత్ క్యాంపస్‌లో నిర్వహించిన సంగీత కచేరీలో కత్తిపోట్లకు గురైన నలుగురు విద్యార్థులలో ఒకరైన ఆదిత్య ఠాకూర్ (22) శనివారం(మార్చి29) చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (UIET)లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఠాకూర్..హర్యాన్వి గాయకుడు మసూమ్ శర్మ కచేరీ సందర్భంగా తొడపై కత్తిపోటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

యూనివర్సిటీ పక్కనే ఉన్న సెక్టార్ 25 మురికివాడనుంచి క్యాంపస్ గోడదూకి వచ్చిన బయటి వ్యక్తులు నలుగురు విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. 
నవంబర్ 19, 2024న బాలుర హాస్టల్ నంబర్ 7లో ఓ వ్యక్తి డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మృతిచెందిన తర్వాత నాలుగు నెలల్లో క్యాంపస్‌లో ఇది రెండవ మరణం కావడం విద్యార్థుల్ల కలవరం, శాంతిభద్రతలపై ఆందోళన చెందుతున్నారు.