వామ్మో ఇదెక్కడి దారుణం: స్టేడియంలోనే అభిమాని తల పగలకొట్టాడు

వామ్మో ఇదెక్కడి దారుణం: స్టేడియంలోనే అభిమాని తల పగలకొట్టాడు

బ్రెజిల్‌ వేదికగా రియో డి జనీరోలో 2026 ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై బ్రెజిల్ తమ చిరకాల ప్రత్యర్థిని అర్జెంటీనాతో తలపడే సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో 2026 FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ వివాదంలో చిక్కుకున్నాయి. బ్రెజిల్ అధికారి ఒకరు అర్జెంటీనా అభిమాని తల పగల కొట్టడంతో స్టేడియంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

బ్రెజిల్, అర్జెంటీనా మధ్య ఫుట్ బాల్ సమరం అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయం. అయితే మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇరు దేశాల ఆటగాళ్లు జాతీయ గీతాల కోసం వరుసలో ఉన్న సమయంలో అర్జెంటీనా అభిమానులలో ఒక వర్గం మీద అక్కడ ఉన్న స్థానిక అధికారులు లాఠీలతో కొట్టారు. ఈ క్రమంలో ఒక అభిమాని తలకేసి గట్టిగా కొట్టడంతో రక్తం ధారాళంగా వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే అక్కడ అధికారులు ఇలా ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది. 
   
ఈ క్వాలిఫయింగ్‌ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ జట్టు అర్జెంటీనాపై ఓడిపోయింది.  మెస్సీ సారథ్యంలోని ప్రపంచ చాంపియన్‌ అర్జెంటీనా 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. 63వ నిమిషంలో నికోలస్‌ ఒటామెండి హెడర్‌ షాట్‌తో గోల్‌ సాధించి అర్జెంటీనాకు ఏకైక గోల్ అందించాడు. స్వదేశంలో ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి.