పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లర్లు

పాకిస్తాన్ ఆక్రమించిన భూబాగంలో కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) బ్యానర్ పరిధిలోని కోట్లి, పూంచ్ జిల్లాల్లో హింసాత్మఘటనతు చోటుచేసుకున్నాయి. అక్కడ జలవిద్యుత్ ఉత్పత్తి ఖర్చు ప్రకారం విద్యుత్తును అందించాలని, రాయితీపై గోధుమ పిండి, ఉన్నత వర్గానికి సంబంధించిన అధికారాలను నిలిపివేయాలని సమ్మె జరుగుతుంది.

ఈ క్రమంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో మిర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) కమ్రాన్ అలీ సబ్-ఇన్‌స్పెక్టర్ అద్నాన్ ఖురేషీ చనిపోయాడు.  90 మంది వరకు గాయపడ్డారు.  జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ  కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అలాగే చాలామందిని అరెస్ట్ చేశారు.

బుధవారం, గురువారం రాత్రి, ముజఫరాబాద్ మరియు మీర్పూర్ డివిజన్‌లలోని వారి నివాసాలు మరియు వారి బంధువులపై దాడులు నిర్వహించి సుమారు 70 మంది JAAC కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు, గురువారం దద్యాల్‌లో తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ఈరోజు ముజఫరాబాద్‌ వైపు లాంగ్‌మార్చ్‌ చేపట్టేందుకు ఒకరోజు ముందుగానే కమిటీ శుక్రవారం షట్టర్‌ డౌన్‌ మరియు వీల్‌ జామ్‌ సమ్మెను ప్రకటించింది.