కారేపల్లి, వెలుగు : మండలంలోని విశ్వనాథపల్లి, భాగ్యనగర్ తండాలో రోడ్ల నిర్మాణానికి శుక్రవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. విశ్వనాథపల్లిలో రూ.2.80కోట్లతో రెండు బీటీ రోడ్లు, భాగ్యనగర్ తండాలో రూ.15లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు.
అనంతరం అప్పాయిగూడెం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ శకుంతల, జడ్పీటీసీ జగన్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఈశ్వరీబాయి, ఎంపీడీఓ సురేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.