జూలూరుపాడు, వెలుగు : రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ అన్నారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో మిత్రపక్ష పార్టీల కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరింత చేరువవుతాయన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్కు ఓటు వేస్తే కులమతాలను రెచ్చకొట్టడం తప్ప ఆ పార్టీలు ప్రజలకు చేసేదేమి లేదని చెప్పారు. కాకర్ల గ్రామంలోని బీఆర్ఎస్కు చెందిన సుమారు 150 కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మంగీలాల్, మధుసూదన్‌రావు, అల్లాడి నరసింహారావు, సుమంత్, రాంబాబు, నరేశ్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సక్షంలో పార్టీలో చేరికలు
జూలూరుపాడు ఎంపీపీ లావుడియా సోని గురువారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బోజతండా మాజీ సర్పంచ్ కిషన్ లాల్, బోజతండాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాయి.