వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులను తన వెంట తెచ్చింది వర్షాకాలం.తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో పాటు వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా జ్వరం, దగ్గు గొంతునొప్ప్పి కేసులు పెరిగాయని డాక్టర్లు అంటున్నారు.జ్వరాలు వచ్చినప్పుడు యాంటీ బయాటిక్స్ మీద డిపెండ్ అవ్వకుండా హాస్పిటల్స్ కి దగ్గరికి వెళ్లాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సగటున రోజుకు 400 అవుట్ పేషంట్లు నమోదవుతుంటే వాటిలో 10 నుండి 15వరకు వైరల్ ఫీవర్ కేసులు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఇది భయపడాల్సిన సంఖ్య కాకపోయినా ఇటీవల కాలంలో పెరుగుతున్న వైరల్ ఫీవర్స్ కి ఇది నిదర్శనమని అంటున్నారు డాక్టర్లు. చాలామందిలో వైరల్ ఫీవర్ వారం రోజుల పాటు ఉంటుందని, ఇంకొంతమందిలో వారం కంటే ఎక్కువరోజులు జ్వరం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.ఇలాంటివారికి కచ్చితంగా ట్రీట్మెంట్ అవసరమని అంటున్నారు డాక్టర్లు.