ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలే..మరి కొంత కాలం వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే పడిన వర్షాలకు అంటువ్యాధులు వస్తున్నాయి. జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పుడొచ్చే వాటిల్లో వైరల్ ఫీవర్ ప్రధానమైనది. వైరల్ ఫీవర్ వచ్చినవారు ఏ ఆహారం తీసుకోవాలి. ఏయే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరల్ ఫీవర్ ను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
మారుతున్న సీజన్‌లో మీరు కొన్ని వంటింటి చిట్కాలు పాటించివచ్చు. దీంతో మీరు వైరల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వైరల్ జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. దీంతో మీరు తరచూగా రోగాల బారిన పడుతుంటారు
వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అందుకు కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవాలి.
- జ్వరం ఉన్నప్పుడు మజ్జిగ అన్నం, బ్రెడ్ తినాలని చెబుతుంటారు కానీ.. వాటి వల్ల నీరసం తగ్గదు.
- వైరల్ ఫీవర్ ఉన్నవారు ఎక్కువగా వెజిటబుల్ జ్యూస్ లు తాగాలి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- శరీరానికి తగిన విశ్రాంతి అవసరం
- ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ద్రవాలు తగినన్ని ద్రవాలు తీసుకోవాలి
- ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవాలి
- సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
- -వాటిలోనే అల్లం, వెల్లుల్లి కూడా కలుపుకుని తీసుకుంటే.. నాలుకకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు వికారాన్ని తగ్గిస్తాయి.
- -చికెన్ సూప్.. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ సూప్ తాగడం వల్ల శరీరానికి లవణాలతో పాటు పోషకాలు కూడా లభిస్తాయి.
- తక్షణ శక్తిని పొందేందుకు అరటిపండ్లను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.
- -బ్రోకలి, కివీ పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి, ఈ, కాల్షియం, ఫైబర్లు అధికంగా ఉంటాయి. బలహీనంగా ఉన్న శరీరానికి శక్తిని అందిస్తాయి.
- వీలైనంత వరకూ కాచి, చల్లార్చిన నీటినే తరచూ తాగుతూ ఉండాలి.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి
- వైరస్ వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి
- వైరల్ ఫీవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే తులసి, దాల్చిన చెక్కలను నీటిలో వేసి మరిగించి తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జ్వరం పునరావృతం కాకుండా చేస్తుంది
- వాము చాలా ప్రయోజనకరమైన మసాలా. ..జలుబు, జ్వరం నుండి ఉపశమనం పొందడానికి మీరు వాము తినవచ్చు. వైరల్ ఫీవర్‌లో వాము చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మీరు నీటిని మరిగించి తాగడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం కలుగుతుంది.
- మీకు తరచుగా జ్వరం, జలుబు ఉంటే ముందుగా పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
- ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా శరీరంలో రోగాలు వస్తాయి. కాబట్టి మారుతున్న కాలంలో ఇటువంటి ఆహారాలను తినకుండా ఉండండి. ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్‌కి కారణమవుతుంది.
వైరల్ జ్వరం కారకాలు
- వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తి స్పర్శ లేదా సదరు వ్యక్తి తీసుకున్న ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది
- కలుషిత ఆహారం, నీరు తాగడం వల్ల వ్యాధి వ్యాప్తి
- దోమలు, కీటకాల కాటు వైరస్ వ్యాపించేలా చేస్తుంది. చలికి కారణం కావచ్చు
- ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా అతని దగ్గర ఉన్నప్పుడు అంటుకుంటుంది
వర్షాకాలంలో తేమ వాతావరణం, బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో దోమలు తమ ఆవాసాలుగా మారిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల మలేరియా వ్యాప్తి జరుగుతుంది.