- ఐదు బృందాలతో మెడికల్ క్యాంప్
సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామస్తులు కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్స్, బాడీపెయిన్స్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ప్రతి ఇంట్లో వైరల్ ఫీవర్ బాధితులు ఉండడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌కు క్యూ కడుతున్నారు. దీంతో గర్రేపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఐదు వైద్య బృందాలు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి బాధితులకు ట్రీట్‌మెంట్ చేశారు.
అలాగే ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ గ్రామాన్ని సందర్శించారు. ఆయన వెంట వైద్యాధికారి అనుదీప్, ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్‌రావు, ఎంపీవో ఫయాజ్ అలీ, వైద్య సిబ్బంది ఉన్నారు.