రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

కేరళలో రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసెజ్ వైరల్ అవుతోంది. ఆ మెసెజ్‌లో నిజం లేదని కేరళ పోలీసులు స్పష్టంచేశారు. రాత్రివేళ ఒంటరిగా ఉన్న మహిళలు ఇంటికి వెళ్లడానికి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉచిత రైడ్‌లు పొందటానికి కేరళ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు అని ఒక మెసెజ్ కేరళ అంతటా చక్కర్లుకొడుతుంది.

హెల్ప్‌లైన్ నంబర్లు 24×7 పనిచేస్తాయని, పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే వాహనాలు, అలాగే పీసీఆర్ మరియు షీ టాక్సీ సర్వీస్ వాహనాలు మహిళలను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తాయని ఆ మెసెజ్‌లో ఉంది. ఈ సేవలన్నీ కూడా పూర్తిగా ఉచితం అని మెసెజ్‌లో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే మహిళలు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా హెల్ప్‌లైన్ నంబర్లకు ఖాళీ సందేశం పంపవచ్చు. దాంతో పోలీసులు సాయం కోరే వారి నెంబర్లను ట్రాక్ చేసి వారి వద్దకు చేరుకుంటారు. కేరళ పోలీసులు సంతకం చేసిన ఈ మెసెజ్‌ను తెలిసిన మహిళలందరికీ ఫార్వార్డ్ చేయాలని కోరుతూ ఒక మెసెజ్ వైరల్ అవుతుంది.

ఈ మెసెజ్ గురించి కేరళ పోలీసులు స్పందించి.. రాష్ట్రంలో అలాంటి పథకమేదీ తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఇటువంటి పథకం పంజాబ్ పోలీసులు ప్రారంభించారని కేరళ పోలీసులు తెలిపారు. కాగా.. మెసెజ్‌లో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయగా.. ఆ నెంబర్ లూధియానా పోలీసులకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ అని కన్ఫర్మ్ అయింది.

For More News..

బిజీగా ఉన్న మార్కెట్‌లో బాంబు దాడి.. 17 మంది మృతి

అయోధ్య ఎయిర్‌పోర్టు పేరు మార్పు!