సూపర్.. వండర్.. : రైలు బోగీలకు పుట్టగొడుగులు వచ్చాయి..

సూపర్.. వండర్.. : రైలు బోగీలకు పుట్టగొడుగులు వచ్చాయి..

భారతీయ రైల్వే శాఖ అద్భుతం.. సూపర్.. వండర్ అని చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు.. ఎందుకంటే మట్టిలో పెంచే పుట్టగొడుగులను.. రైల్వే శాఖ తన రైలు బోగీల్లో పెంచుతుంది.. ఏంటీ అవాక్కయ్యారా.. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఆ వివరాలు ఏంటో చూద్దాం...

ఓ ప్యాసింజర్ రైలు బోగీలో పుట్టగొడుగులను గుర్తించారు ప్రయాణికులు. బోగీ పై భాగంలో ఆరు పుట్టగొడుగులు పుట్టుకొచ్చాయి.. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రైళ్లల్లో పరిశుభ్రత ఎలా ఉంది అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు.. పుట్టగొడుగులు పెరగాటానికి తేమ శాతం ఎక్కువ ఉండాలి.. అంటే రైలు బోగీల్లో తేమ ఉంటుందా.. బోగీలు క్లీన్ చేయటం లేదా.. బోగీలపైన నీళ్లు ఉంటున్నాయా అంటూ ఈ ఫొటో చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తు్న్నారు..

రైలు బోగీల్లో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ అంటూ మరికొందరు వ్యగ్యంగా కామెంట్స్ చేస్తుంటే.. 2, 3 రోజులు జర్నీ చేసే ప్రయాణికులకు ఫ్రెష్ పుట్టగొడుగులు ఫ్రీ అనే ఆఫర్ పెట్టొచ్చు అంటున్నారు మరికొందరు. రైలు బోగీలు తప్పుపట్టిపోయాయి అని.. శుభ్రత లేదని.. వాసన వస్తున్నాయంటూ మరికొందరు నెటిజన్లు తమ రైలు ప్రయాణ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇప్పటికే రైల్వే శాఖ రైళ్లల్లో అందించే భోజనంపై కంప్లయింట్స్ 500 శాతం పెరిగాయి.. ఇదే సమయంలో రైలు బోగీలో పుట్టగొడుగుల ఫొటోలు బయటకు రావటంతో విమర్శలకు తావిస్తోంది.