వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్..: కుంభమేళా పోస్టర్ చూసి పిచ్చోళ్లైపోయారు..!

వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్..: కుంభమేళా పోస్టర్ చూసి పిచ్చోళ్లైపోయారు..!

మహా కుంభమేళా.. ఈసారి144 ఏళ్లకు వచ్చిన పవిత్రమైనది. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. కుంభమేళాకు వెళ్లాలంటే మాటలా ఏంటీ.. చాలా దూరం ప్రయాణం చేయాలి.. చాలా దూరం నడవాలి.. ట్రాఫిక్ చిక్కులు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వెళ్లాలనుకుని పలు కారణాల వల్ల చాలా మంది వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారి కోసం మేమున్నామంటూ.. కుంభమేళాలో ఓ పోస్టర్ అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆఫర్ వింటే మీరు కూడా ఔరా అంటారు.. అబ్బా.. అబ్బా.. ఇలాంటి ఆఫర్ కూడా ఉందా.. నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ ఆఫర్ కదా అంటారు.. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..

‘‘మీరు ప్రయాగరాజ్ వచ్చి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయలేకపోతున్నారా.. డోంట్ వర్రీ.. మీరు ఫొటోను వాట్సాప్ లేదా మెయిల్ చేయండి.. ఆ ఫొటోతోపాటు ఓ 500 రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి.. మీ ఫొటోతో.. మేం త్రివేణి సంగమం దగ్గర మీ తరపున పుణ్య స్నానం చేస్తాం. మీ ఫొటోకు త్రివేణి సంగమంలో స్నానం  చేయిస్తే.. మీరు చేసినట్లు.. మీ ఫొటో పుణ్య స్నానం చేసే ఫొటోలను తిరిగి మీకు పంపిస్తాం.. ఈ విధంగా అయినా మీరు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసినట్లే.. మీకు పుణ్యం వచ్చినట్లే.. మీ జన్మకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది.. మళ్లీ 144 ఏళ్ల తర్వాతనే ఇలాంటి పవిత్ర కుంభమేళా వస్తుంది.. ఈ జన్మలో మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు..’’ ఇదీ ఈ పోస్టర్ సారాంశం..

‘‘ఇదీ మేటర్. అర్థమైందా రాజా’’ అంటున్నారు నెటిజన్లు. ఫొటోకు స్నానం చేయించి.. మిమ్మల్ని పునీతులను చేస్తాం అంటే మీరు నమ్ముతారా.. నమ్మరా ఇలాంటి వాదనలతో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కుంభమేళా పవిత్ర స్నానాలతో మాత్రమే కాదు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలకు కూడా అవకాశం ఇచ్చింది. మార్కెటింగ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ పోస్టర్ చూసి ఎంత మంది ఫొటోలు పంపించారు.. ఎంత మంది డబ్బులు పంపించారు అనేది తెలియకపోయినా.. ఈ పోస్టర్పై మాత్రం నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘‘మీరు కుంభమేళాకు వెళ్లలేకపోయారా.. వెళితే బాగుండు’’ అని ఫీలవుతున్న వాళ్లకు ఇది బెస్ట్ ఆఫర్ అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.