Viral Video: ఇలా చనిపోతున్నారేంటో.. జిమ్లో ఎలా కుప్పకూలిపోయాడో చూడండి..

Viral Video: ఇలా చనిపోతున్నారేంటో.. జిమ్లో ఎలా కుప్పకూలిపోయాడో చూడండి..

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్కు వెళ్లి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటుంటారు. కానీ.. కోవిడ్-19 ఉపద్రవం తర్వాత జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేసే వారిలో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. జిమ్లో జుంబా సెషన్ జరుగుతుండగా ఒక వ్యక్తి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. 54 ఏళ్ల వయసు ఉన్న ఆయన నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో (ఔరంగాబాద్) ఈ ఘటన జరిగింది. హృదయవిదారకమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయిన వ్యక్తిని కవల్జీత్ సింగ్గా గుర్తించారు. మోటార్ వెహికల్స్ వ్యాపారం చేసే కవల్జీత్కు జిమ్కు వెళ్లే అలవాటుంది. రోజూలానే 20వ తేదీ ఉదయం జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేశాడు. ఆ తర్వాత జుంబా సెషన్లో పాల్గొన్నాడు. జుంబా చేసిన కొంత సమయానికి శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించి ఫ్లోర్పై కుప్పకూలిపోయాడు. తోటి వాళ్లు గమనించి ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కవల్ జీత్ సింగ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

కరోనా తర్వాత కొందరు ప్రముఖులు కూడా ఇలానే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. 2022లో టీవీ నటుడు సిద్ధార్థ్ సూర్యవన్షి జిమ్లో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 2021 అక్టోబర్లో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. కరోనా తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంటే ఇలాంటి మరణాలు పెరిగిపోతుండటం జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేస్తున్న వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది.