వైరల్ వీడియో: మహిళా జడ్జితో నిందితుడి పరాచకాలు

  • వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ సందర్భంగా ఘటన

ఫ్లోరిడా: జడ్జిలతో ఎవరైనా సరసాలాడతారా..? జోకులేసి నవ్వించగలరా.. ? ఇలాంటి సంఘటనలు సినిమాల్లో సాధ్యమేమో గాని.. నిజ జీవితంలో చాలా కష్టం. ఒకవేళ జరిగితే.. గిరిగితే చెప్పేవాడు ఉరిశిక్ష లేదా మరణశిక్షకు గురైన నిందితుడు ఫ్రస్టేషన్లో..  షాక్ లో గాని చెప్పి ఉంటాడనుకుంటున్నారా..? లేక  తీవ్ర భయాందోళనకు గురైన సందర్భంలో.. టెన్షన్ తో ఏం మాట్లాడుతున్నామో తెలియని సందర్భంలోనో చెప్పి ఉంటాడనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇలాంటివేవీ కాదు. కావాలంటే మీరు కూడా చూడండి. ఇంగ్లీషులో ఉంది.. అది కూడా అమెరికా యాసలో.. అర్థం కాదనుకోవాల్సిన అవసరం లేదు.. కేవలం 2 నిమిషాలున్న ఈ వీడియో.. 30 సెకన్లు చూస్తే చాలు.. నిందితుడి పరాచకాలు  స్పష్టంగా కనిపిస్తాయి.. వినిపిస్తాయి. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే… డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు పోలీసులు అరెస్టు చేశారు. అతడి నేరానికి సంబంధించిన ఆధారాలతో కేసు ఫైల్ చేసి విచారణ కోసం జడ్జి ముందుకు తీసుకువచ్చారు. తబితా బ్లాక్ మాన్ అనే మహిళా జడ్జి ఈ కేసు విచారణకు స్వీకరించింది. జూమ్ యాప్ ద్వారా  వీడియోలో సంకెళ్లతో నిలుచున్న నిందితుడిని చూస్తూ జడ్జి అతడి నేరానికి సంబంధించిన కేసు వివరాలను చదవడం ప్రారంభించింది. నిందితుడు డెమెట్రియస్ లూయిస్ ఊహించనివిధంగా వెంటనే స్పందించి ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు.. ’ అంటూ జడ్జితో  పరిహాసంగా పలుకరించాడు. మహిళా జడ్జి కోపగించుకోకపోవడంతో వెంటనే.. మీకో మాట చెప్పాలనుకుంటున్నా.. నిజంగానే చాలా అందంగా ఉన్నారు..’’ అని వెంటనే చెప్పేశాడు. దీంతో వీడియో కాల్ లో కేసు విచారణ చూస్తున్న న్యాయవాదులంతా షాక్ కు గురయ్యారు. మహిళా జడ్జి మాత్రం కాంప్లిమెంట్‌లా భావించి చిరు నవ్వుతో నీ పొగడ్తలు ఇక్కడ పనిచేయవంటూ సున్నితంగానే తిప్పికొట్టారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో నెటిజన్లు అనేక రకాలుగా స్పందించి కామెంట్లు పెడుతున్నారు. కావాలంటే మీరూ చేసేయండి..