Video Viralవామ్మో.. ఇదేందిరా నాయినా.. కారు బానెట్​పైకి ఒంటె ఎక్కింది..ఎలాగంటే...

Video Viralవామ్మో.. ఇదేందిరా నాయినా.. కారు బానెట్​పైకి ఒంటె ఎక్కింది..ఎలాగంటే...

సహజంగా రోడ్లపై అప్పుడప్పుడు పెద్ద పెద్ద జంతువులు కూడా వెళ్తుంటాయి.  కార్లలో మనుషులు వెళ్తుంటారు.  కొంతమంది కార్​ బానెట్​ పై కూర్చొని ప్రయాణిస్తూ హల్​ చల్​ చేస్తుంటారు.  తాజాగా ఒంటె కార్​ బానెట్​ పై ఎక్కింది.ఈ వీడియో సోషల్​ మీడియాలో పోస్ట్​ అయింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే....

రాజస్థాన్​ లో శనివారం ( జూన్​ 8) ఓ విచిత్ర సంఘటన జరిగింది.  ఒక్కోసారి రోడ్డుపై అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి.  అలాగే శనివారం ( జూన్​ 8)న రాజస్థాన్​ లో జరిగిన ప్రమాదంలో  ఢీఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో వాహనం బాగా ధ్వంసం అయింది.  అంతేకారు ఒంటెకు కూడా గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన తరువాత కారు బానెట్​పైకి ఒంటె ఎక్కింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

ఈ ప్రమాదంలో  కారు అద్దాలు పగలడంతో పాటు .. బానెట్​ పైకి ఒంటె ఎక్కడంతో  ..... దాని బరువుకు పూర్తిగా పగిలిపోయింది.  ఒంటెకు స్వల్ప గాయాలయ్యాయి.  కారులో ఇరుక్కుపోకుండా విడిపించగలిగారు. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కారులోని ముందు సీట్లు కూడా ధ్వంసమయ్యాయి.  అయితే ( వార్త రాసే సమయానికి) ఒంటెను కారు నుంచి బయటకు తీయలేదు.

సాధారణంగా వాహనాలకు రేడియం స్టిక్కర్లను అమర్చుతారు.  ఇవి చీకటిలో  వెళ్లే వాహనాలను గుర్తించేందుకు వీలుపడతాయి.  స్థానికులు సమాచారం మేరకు కారుకు ఉన్న రేడియం స్టిక్కర్లు సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.  అందుకు కారు ... ఒంటె వెనక వైపు ఢీకొనడంతో కారు బానెట్​ పైకి ఎక్కింది.