అదిగో పాము అంటే ఆమడ దూరం పరిగెడతాం. పాములు సంచరిస్తున్నాయంటే ఆ ప్రాంతంలో ఏ జీవిని కూడా ఉంచరు. అయితే తాజాగా ఓ కర్కోటకుడు కట్టేసిన గేదె దగ్గరకు పాము వెళ్తుంటే కాపాడాల్సింది పోయి.. వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.
పాము పేరు వింటేనే చాలా మంది భయపడతారు.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడింది. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ గేదెను పాము వణికించింది. ఆ సమయంలో గేదెను కాపాడాల్సిన యజమాని ఆ పని మానేసి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ వీడియోలో ఓ గేదె ను చెట్టుకు కట్టేసి ఉంచారు. ఆ సమయంలో ఓ నాగుపాము వేగంగా గేదె వైపు వెళుతోంది. గేదె దగ్గరకు వెళ్లిన తర్వాత పాము బుసలు కొట్టింది.. పామును చూసి గేదె బెదిరిపోయింది. అయితే కట్టేసి ఉండడం వల్ల ఆ గేదె తప్పించుకోలేక పోయింది. ఆ గేదెను కాపాడాల్సిన యజమాని మాత్రం వీడియో తీస్తూ ఉండిపోయాడు. చివరకు ఆ నాగుపాము గేదెను ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ALSO READ: గ్రేట్ ఐడియా : మైదాకు బదులు అరటి పిండి వాడొచ్చు.. ఆరోగ్యానికీ మంచిది
ఈ వీడియోను 9.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అయితే యజమాని తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి హృదయం లేదు.. వీడు అస్సలు మనిషేనా కొంచెం కూడా బుద్ది లేదు.. ఛీ ఇలాంటి వాడిని ఆ పాము కరిస్తే బాగుండు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..