ఆగ్రా: శాంతిభద్రతలను కాపాడే మహోన్నతమైన బాధ్యతను ఖాకీలు నిర్వర్తిస్తుంటారు. కానీ.. కొందరు పోలీసులు మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు. సిగ్గుమాలిన పనులు చేస్తూ తలవొంపులు తెచ్చి పెడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు సభ్య సమాజమే సిగ్గుపడేలా చేసింది.
ఫుల్‌గా మందు కొట్టి ఏం చేస్తున్నాడో అతనికే తెలియనంత మైకంలోకి ఆ కానిస్టేబుల్ వెళ్లిపోయాడు. పట్టపగలు నడిరోడ్డుపై నిల్చుని మద్యం మత్తులో మూత్రం పోస్తూ స్థానికులను విస్తుపోయేలా చేశాడు. రోడ్డు మీద వచ్చేపోయే వాళ్లంతా ఈ ఖాకీ నిర్వాకాన్ని చూస్తుండిపోయారు. కొందరు ఈ ప్రబుద్ధుడి పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
— Priya singh (@priyarajputlive) November 11, 2024
పోలీస్ ఔట్ పోస్ట్ ఎదురుగానే ప్యాంట్ జిప్ తీసి.. మూత్రం పోసిన ఈ కానిస్టేబుల్ వీడియో వైరల్‌గా మారడంతో ఈ ఖాకీ నిర్వాకం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఈ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. సోమవారం (నవంబర్ 11, 2024) ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో కనిపించిన కానిస్టేబుల్‌ను బబ్లూ గౌతమ్‌గా పోలీసులు గుర్తించారు. షాహీద్ నగర్ పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్‌గా బబ్లూ గౌతమ్ విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.
ALSO READ | మణిపూర్‌లో భీకర ఎన్కౌంటర్.. 11 మంది కుకీ తిరుగుబాటుదారుల హతం