
రోజు రోజుకు జనాలకు ప్యాషన్ పిచ్చి ముదిరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి యూత్ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. అసలు ఏ విషయం లేకపోయినా.. ఏదో ఉన్నట్టు చిత్రీకరించి జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. AI జనరేటెడ్ వీడియోలు కొన్ని ఫన్నీగా జనాలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా దోసె చీర.. ఇడ్లీ చొక్కా.. జిలేబీ హెయిర్ స్టిక్ .. ఇలా కొన్ని వస్తువులు సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
AI ఏప్రిల్ 27న రూపొందిన వీడియో hoohoocreations80 అనే యూజర్ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ దోస చీరలో ఎంతో అందంగా ప్రదర్శన ఇచ్చింది. దక్షిణ భారతీయ స్త్రీల సంప్రదాయ చీరకట్టులో బంగారు గోధుమరంగు, ఆఫ్ వైట్ టోన్ లతో అత్యంత ఆకర్షణీయంగా కనపడింది. ఆ తరువాత ఈ వీడియో చూసే వారికి ఐస్ క్రీం బ్యాగ్ కనపడింది. బ్యాగ్ కింద భాగాన ఐప్ క్రీం కరిగి కింద డ్రాప్ కింద పడుతున్నట్లుగా AI తయారు చేసింది. గులాబీ.. ఆకుపచ్చ రంగులను ఐస్ క్రీంలతో బ్యాగును ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రూపొందించింది.
మగవాళ్లు ఎక్కడఫీలవుతారో అనుకున్నదేమో తెలియదు కాని ఇడ్లీ చొక్కాను తయారు చేసింది. బటన్లను కూడా ఇడ్లీల మాదిరిగా తయారు చేసి AI టెక్నాలజీ వావ్ అనిపించేలా ఇడ్లీలతో షర్ట్ రూపొందించింది. ఇంకా పాప్ కార్న్ దుపట్టా... జిలేబీ హెయిర్ స్టిక్.. పానీపూరీ, గులాబ్‌జామ్ లాగా హ్యాండ్ వాచ్.. శాండ్ విచ్, బ్రెడ్ తో ట్రాలీ బ్యాగ్.. బంగాళదుంప చెవిపోగులు . . రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో దోస.. ఇడ్లీ తినడమే కాదు బట్టల మాదిరిగా కూడా వాడుకుంటే ఎలా ఉంటుంది .. అనే క్యాప్షన్ తో పోస్ట్ చేయడంతో నెటిజన్లు స్పందించారు. ఒకరు గోల్గప్ప వాచ్ సూపర్ అనగా.. మరొకరు ఐస్ క్రీం బ్యాగ్.. జిలేజీ హెయిర్ స్టిక్ చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఇంకొకరు దోసె చీరా చాలా నచ్చిందని కామెంట్ చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి బట్టలు.. గులాబ్‌జామ్ వాచ్‌లు.. పాప్ కార్న్ డ్రస్‌లు కూడా మార్కెట్లోకి వస్తాయో చూడాలి మరి..!