ప్రపంచంలో ఫస్ట్ టైం : బాయ్స్ హాస్టల్స్ మధ్య.. స్టూడెంట్స్ క్రాకర్ ఫైటింగ్

స్టూడెంట్స్ అంటేనే కొంచెం ఎగ్రసీవ్ గా ఉంటారు.. అలాంటిది రెండు గ్రూప్స్ మధ్య ఫైటింగ్ అంటే.. ఇంకేముందీ రెచ్చిపోయి కొట్టుకుంటారు. బ్యాట్లు, రాడ్లు, రాళ్లతో కొట్టుకోవటం ఇప్పటి వరకు చూశాం.. ఫస్ట్ టైం.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. దీపావళి క్రాకర్స్ తో బాయ్స్ హాస్టల్స్ మధ్య స్టూడెంట్స్ క్రాకర్స్ ఫైటింగ్ చూశారా.. కనీసం ఇప్పటి వరకు విని కూడా ఉండరు.. అలాంటి ఫైటింగ్ ఇప్పుడు.. ఇండియాలో రెండు స్డూడెంట్ గ్యాంగ్స్ మధ్య జరిగింది. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో విశేషాలు పూర్తిగా తెలుసుకుందామా...

 దీపావళి పటాకుల్లో షార్ట్స్ కు ఓ ప్రత్యేకత ఉంది.. 12, 24, 36 ఇలా షార్ట్స్ ఉన్న బాంబ్స్ ఉంటాయి. ఒక్కసారి వెలిగిస్తే చాలు.. రాకెట్ లో దూసుకెళ్లి పేలిపోతాయి.. ఇలాంటి షార్ట్స్ ను వ్యక్తి.. హెల్మెట్ పెట్టుకుని.. చేతులతో పట్టుకుని.. బాయ్స్ హాస్టల్ పైకి వెళతాడు. హాస్టల్ వైపు షార్ట్స్ ను పేల్చుతాడు.. అపోజిషన్ గ్యాంగ్ ఊరుకుంటుందా ఏంటీ.. వాళ్లు కూడా హాస్టల్ నుంచి లక్ష్మీ బాంబ్స్, రాకెట్లను వీళ్లపైకి వదులుతారు.. రెండు బాయ్స్ హాస్టల్స్ మధ్య స్టూడెంట్స్ క్రాకర్స్ గ్యాంగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

దివాళీ క్రాకర్స్ తో ఇలా ఫైటింగ్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం కావటం విశేషం.. విచిత్రం.. గతంలో ఎప్పుడూ ఇలాంటి చూడలేదని నెటిజన్లు అంటున్నారు. ఇది కొత్త ట్రెండ్ అని.. రాబోయే దీపావళికి ఇలాంటివి మరిన్ని జరగొచ్చని అంటున్నారు నెటిజన్లు..

ALSO READ :- అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ : రూ.15 కోట్ల కొకైన్ పట్టివేత