Viral Video: రామతా జోగి పాటకు తల్లీకూతుళ్ల డ్యాన్స్​ అదుర్స్​

Viral Video: రామతా జోగి పాటకు తల్లీకూతుళ్ల డ్యాన్స్​ అదుర్స్​

హైటెక్​ యుగంలో జనాలు పాపులర్​ అయ్యేందుకు సోషల్​ మీడియాను ఉపయోగిస్తున్నారు.  ప్రతిదాన్ని రికార్డ్​ చేయడం .. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం .. ఆపై లైక్​లు.. కామెంట్లతో రచ్చ చేయడం జనాలకు అలవాటైంది.  ఇప్పుడు ఓ తల్లి కూతురు రామతాజోగి పాటకు డ్యాన్స్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. 

AALSO READ | టెక్నాలజీ : ఫేస్​బుక్​లో ‘ఫ్రెండ్స్’ ట్యాబ్​

వైట్​ కలర్​ మ్యాచింగ్​ డ్రస్​ ధరించిన తల్లీకూతుళ్లు రామతాజోగి పాటకు స్టెప్పేసి సోషల్​ మీడియాలో  పోస్ట్​ చేశారు. ఈ వీడియోను 1.3 మిలియన్ల మంది సబ్ స్క్రైబ్​ చేశారు. ఈ డ్యాన్స్​ సోషల్ మీడియాలో వైరల్​ అయింది. ​ .

1999లో సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం తాల్ లోని ఒక హై-ఎనర్జీ పాట రామతా జోగి. సుఖ్విందర్ సింగ్ .. అల్కా యాగ్నిక్ ఈ పాటను పాడారు. ఇది  ఐకానిక్ డ్యాన్స్ నంబర్‌గా మారింది .  ఈ పాటకు తల్లీకూతుళ్లు వేసిన డ్యాన్స్​  వీడియోను షాలు త్యాగి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (@shalutyagidance) షేర్ చేయడంతా  వైరల్ అయింది.  

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  ఒక యూజర్  బెస్ట్ మదర్ అండ్ డాటర్ జోడి అని కామెంట్ చేయగా... తల్లీకూతురు కాంబినేషన్​ డ్యాన్స్​ లో ప్రతి రీల్​ నచ్చిందని రాశారు.  ఇంకొకరు .. వావ్.... శివి  పెర్ఫార్మెన్స్   అద్భుతంగా ఉందన్నారు. నాలుగో వ్యక్తి ... ఓరి దేవుడా, ఆమె చాలా స్మూత్ గా ఉందంటూ.. ఆ డ్యాన్స్​ చూడటం చాలా ఇష్టంగా ఉందని.. ఎవరికిష్టం వచ్చినట్టు వారు కామెంట్​ బాక్స్​ను నింపేశారు.