పోలీస్ స్టేషన్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. సీసీ కెమెరా వీడియోలు వైరల్..

పోలీస్ స్టేషన్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. సీసీ కెమెరా వీడియోలు వైరల్..

అడవులకు సమీపంగా ఉన్న ఊళ్లలో చిరుత సంచారం అన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం.. ఊళ్లలో చిరుత సంచరించడం, అటవీ అధికారులు ట్రేస్ చేసి అడవిలో వదిలేయడం తరచూ జరిగేదే.. కానీ.. తమిళనాడులో ఓ చిరుత ఏకంగా పోలీస్ స్టేషన్  లోకి వెళ్ళి చక్కర్లు కొట్టింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్లో సోమవారం ( ఏప్రిల్ 28 ) రాత్రి 8: 30 గంటల సమయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్లో చిరుత సంచారం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్లి కలియతిరిగింది చిరుత. చిరుత సంచారంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాసేపు అటు, ఇటు కలియదిరిగిన చిరుత ఎట్టకేలకు బయటకు వెళ్లడంతో  వెంటనే తలుపులు మూసేసారు సిబ్బంది.

ఈ ప్రాంతంలో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువయిందని స్థానికులు అంటున్నారు. అటవీశాఖ అదుకారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పోలీస్ స్టేషన్లో చిరుత చక్కర్లు కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.