తెలివి ఎక్కువైందే : గులాబీ పూలతో పకోడీ అంట.. మనోళ్లు బాగానే తింటున్నారు..!

తెలివి ఎక్కువైందే : గులాబీ పూలతో పకోడీ అంట.. మనోళ్లు బాగానే తింటున్నారు..!

పకోడీ.. కామన్ గా ఉల్లిపాయలతో.. ఆలూతో చేస్తారు.. ఇంకా కొంచెం వైరటీ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పకోడీలు కూడా చేస్తారు.. ఇది కామన్.. మనోడు మాత్రం మరీ వైవిధ్యం.. గులాబీ పూలతో పకోడీ చేశాడు.. ఇదేదో రీల్ కోసం చేసింది కాదు.. నిజంగా రోజూ అమ్ముతున్నాడు కూడా.. ఎక్కడో కాదు మన దేశంలోనే.. ఈ గులాబీ పూల పకోడీ కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..

అసలే వర్షాకాలం, వాతావరణం చల్లగా మారింది. ఇలాంటి సమయంలో వేడి వేడి పకోడి తింటే ఉంటుందీ.. ఊహించుకుంటేనే నోరు ఊరిపోతోంది కదూ! అయితే పకోడి వేటితో చేసుకుంటారు చెప్పండి. ఏముంది.. ఉల్లిపాయ లేదా క్యాబేజీ, మరీ అంటే గోబీతో చేస్తారు అంటారా.? సహజంగా మనలో చాలా మందికి తెలిసిన పకోడిలు కూడా ఇవే. అయితే గులాబీతో పకోడిలు చేసుకుంటే ఎలా ఉంటుంది. గులాబీతో పకోడి ఏంటని మొహం తిప్పుకుంటున్నారు కదూ! కానీ ఇప్పుడు ఈ గులాబీ పకోడి వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. 

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటే ఇదేనేమో. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. పకోడికి అర్థాన్ని మార్చేస్తూ ఓ వ్యక్తి గులాబీలతో పకోడి చేస్తున్నాడు. అయితే ఏదో ఇంట్లో సరదాగా చేసుకుంటున్నాడంటే పొరబడినట్లే. ఎంచక్కా బండిపై చేసిన అమ్ముతుంటే ప్రజలు క్యూలో నిలబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఆ వ్యక్తి ఎర్రటి గులాబీ కాడలను నీట్‌గా కట్ చేశాడు. అనంతరం అచ్చంగా పకోడి కోసం రడీ చేసుకున్నట్లుగానే శనగపిండిలో కారం, ఉప్పుతో పాటు కావాల్సిన అన్ని వస్తువులను వేశాడు. అనంతరం నీటిని పోసి పిండిన రడీ చేసుకున్నాడు. 

ఈ వైరల్ వీడియోలో మొదటిగా ఓ వ్యక్తి 4 గులాబీ పువ్వులను (Rose Flower) తీసుకుని.. వాటి కాడలను కట్ చేసి, కేవలం పూలను నీటిలో ఉంచి దానిని పక్కన పెడతారు.. ఆ తర్వాత ఓ గిన్నెలో శనగపిండి తీసుకొని అచ్చం బజ్జీలకు చేసుకునే విధంగా పిండిని తయారు చేసుకుని అందులో గులాబీ పూలను ముంచి తీసి చివరకు నూనెలో వేయిస్తాడు. అలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత దానిని పక్కకు తీసి వెంటనే ప్లేట్‌లో వేసి ...  అప్పటికే ఎదురు చూస్తున్న కస్టమర్స్‌ లొట్టలేసుకొని తింటున్నారు . దాంతో ఆ వ్యక్తి గులాబీ పువ్వు పకోడీ (Rose Flower Pakodi) చాలా బాగున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఓమ్నివియామ్ మీడియా యొక్క బ్లెస్డ్ ఇండియన్ ఫుడీ పేజీ (@blessedindianfoodie) ద్వారా Instagramలో పోస్ట్ చేయబడిన ఈ  జూలై 2024 లో అప్‌లోడ్  అయింది.   61 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. అయితే ఈ స్టాల్​ ఎక్కడ ఉందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 ఈ వీడియో చూసిన కొందరు గులాబీతో పకోడి ఏంటి బాబూ అంటూంటే మరికొందరు మాత్రం, గులాబీ పువ్వు ఆరోగ్యానికి ఎలాగో మంచిది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు ఇలాంటి వంటకాలు చేయాలని మీకు ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం అవ్వట్లేదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరొకరేమో.. గులాబీ పువ్వు పకోడీ తిన్న వ్యక్తి వీడియో తీస్తున్నాడని ఫేస్ అలా పెట్టడడా లేకపోతే నిజంగా బాగుందా.? అంటూ ప్రశ్నిస్తున్నాడు.  ఇది చూసి మీరు కూడా ఒక పట్టు పడతారో, ఆశ్చర్యపోతారో, నవ్వుకుంటారో, లేకపోతే కోప్పడతారో మీ ఇష్టం.