
పెళ్లి పెటాకులు అయినందుకు పాకిస్తానీ మహిళ డ్యాన్స్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాధారణంగా విడాకులు తీసుకోవడాన్ని ఇప్పటికీ చాలా పెద్ద విషయంగా చూస్తారు. పెళ్లి తర్వాత విడిపోయే దంపతులను సమాజం చాలా తప్పుబడుతుంది, అవమానిస్తుంది. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న ప్రస్తుత సొసైటీకి ఒక మహిళ పెద్ద షాక్ ఇచ్చింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ మహిళ డ్యాన్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. పాకిస్తానీ సాంప్రదాయ దుస్తులలో ధరించిన అజీమా, ఒక బహిరంగ కార్యక్రమంలో కోక్ స్టూడియో ద్వారా మాఘ్రోన్ లా ఆత్మీయ బీట్‌లకు డ్యాన్స్ చేసింది. ప్రేక్షకులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవడంతో ఆమె ప్రదర్శనకు ప్రశంసల వర్షం కురిపించారు.
అజీమా ఇహ్సాన్ అనే పాకిస్తానీ మహిళ విడాకులు తీసుకున్న తరువాత డ్యాన్స్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. ఈ వీడియో అజీమా ఇహ్సాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (@azima_ihsan ) లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆ దేశంలో మహిళలకు విడాకులను మరణశిక్షగా భావిస్తారని వీడియో ద్వారా తెలియపరిచింది. డైవర్స్ విషయాన్ని సవాల్ చేస్తూ వైఫల్యం అనే దానికంటే కొత్త జీవితం ప్రారంభం అని పాట ద్వారా తెలిపింది. విడాకులు తన ముగ్గురు పిల్లలకు..తనకే స్వేచ్చ ఇస్తాయని.. అలాగే మాజీ భర్త కూడా సరైన నిర్ణయం తీసుకున్నారని ఆమె అభిప్రాయ పడింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పటి వరకు ( వార్తరాసే సమయానికి) 1.4 మిలియన్ల వీక్షణలను పొందగా.. నెటిజన్లు స్పందించారు. కొందరు ఆమె ఆత్మ విశ్వాసాన్ని ప్రశంసించగా.. మరికొందరు ఆమె డ్యాన్స్ వెనుక ఉన్న సందేశంపై చర్చకు తెరలేపారు.
సమాజంలో విడాకులతో విడిపోయిన తర్వాత జీవితాన్ని నావిగేట్ చేసే మహిళలు ఎదుర్కొంటున్న పోరాటాలు ... విజయాల గురించి ముఖ్యమైన సంభాషణలకు దారితీసింది.ఒకరు మాత్రం ఆహ్.. దేవుడు.. మీ ఆనందాన్ని.. శాంతిని కాపాడతాడని .. మీ జీవితం ప్రకాశవంతంగా సాగుతుందని.. మీకు అడ్డుగా ఉన్న వారిని ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వ్యాఖ్యానించారు. ఇంకా కామెంట్ బాక్స్ లో విడాకులు అనేవి శారీరక... మానసిక వేధింపుల నుంచి విముక్తి అన్నారు. ఇంకొకరు ఇహ్సాన్ విశ్వాసాన్ని ప్రశంసిస్తూ.. మీరు చేసిన సాహసం అద్భుతం.. చాలా శక్తివంతం.. చాలా గర్వంగా ఉంది బేబి ...అంటూ కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.