వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు

ఘాజియాబాద్‌: తాగిన మత్తులో కొంత మంది యువకులు.. బిజీ రోడ్డులో కారుపైకి ఎక్కి చేసిన వెర్రి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పబ్లిష్ అయిన కొన్ని గంటలకే పోలీసులు స్పందించి.. ఆ కారు ఓనర్‌‌పై భారీ జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగింది.

యూపీలోని ఘాజియాబాద్‌లో ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై కొంత మంది యువకులు తాగిన మత్తులో వెర్రి చేష్టలు చేశారు. కారు నెమ్మదిగా నడస్తుండగానే ఇద్దరు యువకులు కారు పైకి ఎక్కి చిందులు వేశారు. దీనిని అటువైపుగా కారులో వెళ్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ వీడియోను పెట్టి.. ఆ యువకులపై యాక్షన్ తీసుకోవాలంటూ ఘాజియాబాద్‌ పోలీసులకు ట్యాగ్ చేశాడు. అతడు నిన్న రాత్రి 8.39 గంటల సమయంలో ఈ వీడియోను ట్వీట్ చేయగా.. కొన్ని గంటల్లోనే పోలీసులు స్పందించారు. ఆ కారుపై ఏకంగా రూ.20 వేలు జరిమానా విధించారు. ఈ విషయాన్ని  అర్ధ రాత్రి 12.23 గంటలకే ట్విట్టర్‌‌లో పోస్ట్ కూడా చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఆస్కార్ అకాడమీకి విల్ స్మిత్ రాజీనామా

ప్రభుత్వాల తీరుతో ఉగాది పండుగ చేసుకోలేని స్థితి

దేశ అత్యున్నత పదవిలోకి మహిళా నేత!