ఏం ఉందిరా నీ ఐడియా : పెద్ద సూట్ కేసులో ప్రియురాలిని పెట్టి.. హాస్టల్ కు తీసుకొచ్చాడు..!

ఏం ఉందిరా నీ ఐడియా : పెద్ద సూట్ కేసులో ప్రియురాలిని పెట్టి.. హాస్టల్ కు తీసుకొచ్చాడు..!

ఏం ఐడియా అది.. అదిరిపోలా ఐడియా.. మనోడి ఐడియాకు బాయ్స్ హాస్టల్ మొత్తం షాక్ అయ్యింది.. ఇలా కూడా వాడొచ్చా.. ఇలాంటి ఐడియా కూడా ఉంటుందా అని మిగతా స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు.. ఇంతకీ మేటర్ ఏంటీ అంటారా.. బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న ఈ ఖతర్నాక్ కుర్రోడు.. తన ప్రియురాలిని హాస్టల్ కు తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు.. బాయ్స్ హాస్టల్ లో గర్ల్స్ కు నో ఎంట్రీ కదా.. మరి ఎలా అని ఆలోచించి ఓ ఐడియా వేశాడు.. పెద్ద సూట్ కేసు ఒకటి తీసుకున్నాడు.. అందులో తన ముద్దుల ప్రియురాలిని పెట్టాడు.. సూట్ కేసును హాస్టల్ లోకి లగేజీ బ్యాగ్ లా తీసుకొచ్చాడు.. చివరికి సెక్యూటిరీ సిబ్బందికి పట్టుబడి.. బండారం బయటపడింది.. ఇంకేముందీ మేటర్ వైరల్ అయ్యింది..

A boy tried sneaking his girlfriend into a boy's hostel in a suitcase.

Gets caught.

Location: OP Jindal University pic.twitter.com/Iyo6UPopfg

— Squint Neon (@TheSquind) April 12, 2025

చదువుకోండ్రా బాబూ అని కాలేజీలకు.. యూనివర్శిటీలకు పిల్లలను పంపిస్తే వారు అక్కడ చక్కపెట్టే రాచకార్యాలు అన్నీ ఇన్నీ కావు... అందుకే.. బోయస్​ కు.. గరల్స్​ కు విడివిడిగాహాస్టల్స్ ఉంటాయి.  అయినా కొంతమంది ప్రేమాయణం కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటివన్నీ  హాస్టల్​ బయటే జరుగుతాయి.

  కాని ఇప్పుడు హర్యానా లోని  సోనిపట్​  ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ యువకుడు తన ప్రియురాలిని హాస్టల్ గదిలోకి తీసుకెళ్లేందుకు తెగించాడు. ఆమెను ఓ సూట్‌కేసులో ప్యాక్ చేసి తీసుకెళుతూ సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. ఆ విద్యార్థి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి సూట్‌కేసును ఓపెన్ చేయగా.. ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్నవాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.   సూట్​ కేస్​ లో ఉన్న అమ్మాయి  ఫోజులిస్తూ   మీమ్ మెటీరియల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వెళ్లాలని ఒకరు రాశారు.

🤣🤣

meanwhile that girl in the suitcase & also that guy in yellow shirt posing for a photo while opening the suitcase should go to meme material hall of fame.. 😅

— That Anonymous dude (Modi's family) (@AnonEagleFlight) April 12, 2025

 ఇంకొకరు సూట్​ కేస్​ లను ఇలా కూడా వాడొచ్చని కొత్త ఆలోచన వచ్చింది.. కాని నేను ఇప్పుడు ఇలా ప్రయత్నించేందుకు వయస్సుదాటిపోయందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని మరొకరు కామెంట్ చేయగా… అసలు సూట్‌కేసులో అమ్మాయి ఉందని ఎలా తెలిసిందో అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు

These suitcases have multiple uses these days. Anyways, I like the idea. However, I'm past my age to try it.

— Simanta J Saikia (@SimantaJSaikia) April 12, 2025

<