Viral Video: ​ మహావీర్​మేళాలో ఘోరం... ఇంటి పైకప్పు కూలి వంద మందికి గాయాలు

 బీహార్‌ (Bihar)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో రూఫ్‌ కూలి (Roof Collapses) పలువురు గాయపడ్డారు. ఛప్రా (Chhapra) నగరంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.

బీహార్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. సరన్‌ నగరంలో మంగళవారం రాత్రి స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించిన మహావీర్ మేళా సంగీత కార్యక్రమంలో కనురెప్పపాటులో ఓ ఇంటి బాల్కని కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా గాయపడగా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSIPO READ | wolves attack:వాటికి ఏమైందీ..జనంపై తోడేళ్ల దాడులు ఎందుకు..? : 30 ఏళ్ల తర్వాత అలజడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరన్‌ జిల్లాలో  ఇషావ్‌పూర్ బ్లాక్‌లో మహావీర్ అఖారా (Mahavir Akhara) ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. నృత్య ప్రదర్శనను తిలకించేందుకు చాలా మంది భవనాల పైకప్పులపైకి ఎక్కారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటిపైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 

 దీంతో ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో జనం అరుపులు పెడుతూ పరిగెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంరూఫ్‌ కూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.