రెండు అడవి ఎలుగు బంట్లు ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లాలోని ఉమర్ కోట్ దగ్గర కొందరు యువకులు ఫుట్ బాల్ ఆడుతున్నారు. అటువైపు రెండు అడవి ఎలుగులు వచ్చాయి. యువకులు ఆడుకుంటున్న బాల్ వాటి వైపు వెళ్లింది. దీంతో రెండు ఎలుగు బంట్లు సరదాగా కాసేపు బాల్ తో ఆడుకున్నాయి. దీనిని అక్కడే ఉన్న యువకులు వీడియో తీశారు. ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.