మ్యాగీ.. చిటికెలో తయారవుతుంది.. రెండు నిమిషాల్లో రెడీ.. ఇది యాడ్ అయినా.. అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇదే మ్యాగీతో మేం చెప్పబోయే.. చూపించబోయే వీడియోలో మాత్రం చాలా భయంకరమైనది ఉంటుంది. మ్యాగీ అనగానే నీటిలో వేసి తయారు చేస్తారు.. అందుకు భిన్నంగా మ్యాగీని తయారు చేస్తున్న ఈ వీడియోపై.. నెటిజన్లు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాటిని అస్సలు ట్రై చేయొద్దని.. ఇలాంటి రెసిపీ ఆరోగ్యాలను పాడు చేస్తుందని.. సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ ఆ మ్యాగీ వంటకం ఏంటో చూద్దాం...
మ్యాగీని నీళ్లల్లో కాకుండా.. నూనెలో ఫ్రై చేస్తున్నారు.. బాగా డీ ఫ్రై అయ్యే వరకు వేయిస్తున్నారు. అలా తీసిన మ్యాగీ.. ఎర్రగా.. కరకరలాడుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వంటకం వీడియోలో మ్యాగీని నూనెలో వేయించారు. అది ఎర్రగా కాలిన తరువాత .. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, టమోటా ముక్కలు వేసి భేల్ పూరిగా తయారు చేశారు. రుచి కోసం నిమ్మరసం, సాస్, ఉప్పు, మ్యాగీ మసాలా కలిపి .. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తినడం ప్రారంభించాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ind_swad అనే యూజర్ IDతో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) 9 మిలియన్ల మంది చూడగా అది వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఒకరు మ్యాగీ అట్రాసిటి అనగా... మరొకరు ఈ మిశ్రమానికి గంగా నీళ్లను కలిపితే మ్యాగీ ఆత్మ శాంతిస్తుందని రాసుకొచ్చారు.